సమస్యల వలయం లో టాలీవుడ్ !

Seetha Sailaja
దాదాపు 100 సంవత్సరాల చరిత్రకు దగ్గరలో ఉన్న టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కనీవినీ ఎరుగని సమస్యల మధ్య చిక్కుకుపోతోంది. రోజురోజుకి ధియేటర్లకు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోవడంతో పాటు పెరిగిపోతున్న నటీనటుల పారితోషికాలతో సినిమా తీయడం ఒక జూదంగా మారిపోతోంది. సినిమాల పై పెట్టుబడి పెట్టేకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అన్న నిర్ణయానికి ఇప్పటికే అనేకమంది నిర్మాతలు ఉన్న తరుణంలో భవిష్యత్ లో సినిమాలు తీయడానికి నిర్మాతలు కరువైపోతారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ ధియేటర్ల యజమానులు ఈనెలాఖరు వరకు తమ ధియేటర్లను మూసి వేయాలని తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీకి మరన్ని సమస్యలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి మంచి సీజన్ గా పేర్కొనదగిన సమ్మర్ సీజన్ లో ఒక్క మంచి సినిమా కూడ విడుదల లేకపోవడంతో ఈ పరిస్థితి సంభవించింది అన్న మాటలు వినిపిస్తున్నాయి.

విడుదల అవుతున్న కొన్ని చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ వాటిని ఓటీటీ లో చూసుకోవచ్చు అన్న అభిప్రాయంలో ప్రేక్షకులు ఉండటంతో ఇండస్ట్రీకి ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయి అని అంటున్నారు. దీనికితోడు టాప్ హీరోలు సంవత్సరానికి ఒక్క సినిమా కూడ వడుదల చేయలేని పరిస్థితులలో ఉండటంతో సినిమాల పాయి ప్రేక్షకులకు పూర్తిగా ఆశక్తి తగ్గింది అన్న విశ్లేషణలు కూడ వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో సింగిల్ ధియేటర్ యజమానులకు తమ ధియేటర్ లకు సంబంధించి కరెంట్ ఖర్చులు కూడ రావడం లేదనీ దీనికి బదులు ఆ ధియేటర్లను కూల్చివేసి వాటి స్థానంలో కళ్యాణమండపాలు కానీ షాపింగ్ కాంప్లెక్స్ లు కానీ కట్టుకుంటే మంచిది అన్న ఆలోచన వారికి ఏర్పడటంతో ఈ ధియేటర్ల మూసివేత సమస్య వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ లోని సింగిల్ ధియేటర్ల యజమానులకు కూడ ఏర్పడితే ఇక రానున్న రోజులలో సింగిల్ ధియేటర్స్ కనుమారుగైపోయి సినిమా వినోదం సామాన్య ప్రేక్షకులకు అందని విషయంగా మారే ప్రమాదం ఉంది అన్న హెచ్చరికలు వస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: