గ్లామర్ డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ..!!

murali krishna
బిగ్ బాస్ బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపు మరింత గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా బ్రౌన్ కలర్ మోడ్రన్ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులిచ్చి సోషల్ మీడియాలో ఫోటోలు వదిలింది.తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి.ఇటీవల కాలంలో స్రవంతి చొక్కారపు అందాల ఆరబోతతో అదరగొడుతోంది. హీరోయిన్లకు కూడా పోటీని ఇచ్చే విధంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేస్తున్న ఫోటోలు సెగలు రేపుతున్నాయి. రోజురోజుకూ గ్లామర్ హద్దులు చెరిపేస్తూ మరింత హాట్ హాట్ గా దర్శనమిస్తోంది. ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అలా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన స్రవంతి ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, మూవీ ప్రమోషన్స్ తో మరింత ఫేమస్ అయ్యింది.ఇప్పుడు తెలుగులో ఉన్న నోటెడ్ యాంకర్స్ లో స్రవంతి కూడా ఒకరు. హీరోయిన్ల రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సంప్రదాయ లుక్ లోనే కాదు హాట్ నెస్ కు కూడా కేరాఫ్ అడ్రస్ అన్పిస్తోంది. ప్రస్తుతం స్రవంతి ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు సినిమా ఫంక్షన్లలో యాంకర్ గా బిజీబిజీగా గడిపేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన అందమైన ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజెన్ల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది.. ఈ బిగ్ బాస్ బ్యూటీ సెగలు పుట్టించే హాట్ షోకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. అందుకే ఆమె ఎప్పుడు ఫోటోలు పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ కావడమే కాదు, వెంటనే కామెంట్ల వర్షం కురుస్తుంది.తాజాగా బ్రౌన్ డ్రెస్ లో దర్శనమిచ్చిన స్రవంతి క్యూట్ అండ్ హాట్ ఫోజులతో కట్టిపడేసింది. కన్ను కొడుతూ, కిస్ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చి తన ఫ్యాన్స్ ను కవ్విస్తోంది. అంతే కాదు షర్ట్ ఫై బటన్ విప్పి తన ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. పైగా థై స్లిట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఇక ఈ దుస్తుల్లో ఈ బ్యూటీ అందం చూసి స్రవంతి హీరోయిన్ ఫిగర్ అంటూ ఆకాశనికి ఎత్తేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.
ప్రస్తుతం యాంకర్ గారు రాణిస్తున్న స్రవంతిని హీరోయిన్ గా వెండి తెరపై చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ తరువాత సినిమాల్లో కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా మెరుస్తుందేమో అనుకుంటే అది కూడా జరగలేదు. మరి స్రవంతి టాలీవుడ్ మేకర్స్ కంట ఎప్పుడు పడుతుందో, అభిమానుల కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే రోజు రోజుకు ఆమె గ్లామర్ గేట్స్ ఎత్తేయడం చూసి మైమరిచిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: