ఆ స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రేమలు హీరోయిన్..!?

Anilkumar
తెలుగులో విడుదలైన మలయాళ సినిమా ప్రేమలు ఎంతటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా కంటే ఎక్కువ ఆ సినిమాలో హీరోయిన్గా నటించినా మమిత సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ రేట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా కంటే ముందు ఈమె దాదాపుగా పది సినిమాలకు పైగానే నటించింది. అందులో కొన్నిట్లో హీరోయిన్గా నటిస్తే మరికొన్ని సినిమాల్లో మాత్రం కీలక పాత్రల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. కానీ ఈ సినిమా మాత్రం తనకి ఏ సినిమా తీసుకురానే పేరు

 తీసుకువచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ ఒక్క సినిమాతోనే తనకి మలయాళం తోపాటు తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కుతుంది. అలాగే తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకునేలా చేసుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ సినిమా తెలుగులో కూడా విడుదలై బ్లాగ్ మిస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. అటు మలయాళం లో సైతం ఈ బ్యూటీ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు సైతం తెలుగులో హీరోయిన్గా పరిచయం చేయాలని చాలామంది ట్రై చేస్తున్నట్లుగా

 తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలు ఈమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తోంది.  నిజానికి ఈ సినిమాలో ముందు శ్రీలీల హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆమెను కాకుండా వేరే హీరోయిన్ ని వెతుకుతున్న దర్శక నిర్మాతలు మమిత బైజుని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది మలయాళం హీరోయిన్లు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్లు స్టార్ స్టేటస్ ని కూడా అందుకున్నారు. మరి వారి బాటలోనే వెళుతున్న మమిత బైజు కూడా తెలుగులో పేరు తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: