ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2
మూవీ ని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన
థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా యొక్క కర్ణాటక
థియేటర్ హక్కులను అమ్మి వేశారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ
సినిమా యొక్క కర్ణాటక హక్కులను ఎన్
సినిమా సంస్థ దక్కించుకున్నట్లు పుష్ప యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ
పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1
మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2
మూవీ పై కర్ణాటక ఏరియాలో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక భారీ అంచనాలు ఈ సినిమాపై కర్ణాటక లో ఉండడంతో ఈ
మూవీ ని కర్ణాటక ఏరియాలో భారీ మొత్తంలో విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం వారు సన్నాహాలను చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో నేషనల్
క్రష్ రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్
డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఈ సినిమాలో ఫాహధ్ ఫాజిల్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
అనసూయ ,
సునీల్ ,
రావు రమేష్ ఈ
మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.