డార్లింగ్ : షూటింగ్ కంప్లీట్..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లి చూపులు అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియదర్శి , విజయ్ దేవరకొండ కు స్నేహితుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా విజయ్ , రీతు , తరుణ్ కి ఏ స్థాయిలో గుర్తింపు దక్కిందో ఈ మూవీ లో విజయ్ కి స్నేహితుడి పాత్రలో నటించిన ప్రియదర్శి కి కూడా అదే రేంజ్ లో గుర్తింపు లభించింది.
 

దానితో పెళ్లి చూపులు సినిమా తర్వాత ఈయనకు వరుసగా సినిమాలు రావడం మొదలు అయింది. దానితో ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షక ఆదరణ భారీగా పొందడంతో ఈయనకు సినిమాల్లో హీరో అవకాశాలు కూడా రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈయన హీరోగా రూపొందిన మల్లేశం , బలగం సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ నటుడు డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ను మేకర్స్ చాలా సైలెంట్ గా పూర్తి చేశారు.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఒక చిన్న వీడియోని విడుదల చేశారు. అంతలోనే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ రోజు తో ఈ సినిమా యొక్క మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనుల స్పీడును బట్టి ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: