"హనుమాన్" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని రోజుల క్రితం తేజా సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ఏకంగా 200 కోట్లకు పైగా కలెక్షన్ లు వచ్చాయి. ఇలా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బారి కలెక్షన్ లను కొల్లగొట్టి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇలా థియేటర్ మరియు ఓ టి టి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే బుల్లి తెరపై ప్రసారం అయింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ కొన్నిరోజుల క్రితమే మొదటి సారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్లో ప్రసారం కాగా 10.26 టి ఆర్ పి రేటింగ్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ టి ఆర్ పి రేటింగ్ దక్కింది అని చెప్పవచ్చు. ఇలా ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: