ఫహాద్ ఫాజిల్ "ఆవేశం" మూవీకి రివ్యూ ఇచ్చిన సమంత..!!

murali krishna
ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్ మూవీస్ వస్తున్నాయి.తాజాగా రిలీజ్ అయిన 'ఆవేశం' మరో బ్లాక్‍బస్టర్ దిశగా దూసుకెళుతోంది. మలయాళం స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ దాటి అదరగొట్టింది.ఏప్రిల్ 11వ తేదీన విడుదలైన యాక్షన్ కామెడీ మూవీ 'ఆవేశం' ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్ నటనకు ప్రేక్షకులు అందరూ ఫిదా అవుతున్నారు. తాాజాగా, స్టార్ హీరోయిన్ సమంత.. ఆవేశం సినిమాపై తన రివ్యూను ఇచ్చారు.ఆవేశం చిత్రం గురించి ఓ స్టోరీని సమంత తన ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. కొన్ని సినిమాలను థియేటర్లలోనే చూడాలని, ఈ మూవీ కూడా అలాంటిదేనని సమంత రాసుకొచ్చారు.ఆవేశం చిత్రాన్ని అసలు మిస్ అవొద్దని సమంత పేర్కొన్నారు.

 "ఆవేశం చిత్రంలో అన్ని రకాల మ్యాడ్‍నెస్ ఉంది. అలాంటి పిచ్చి నాకు ఎంతగానో నచ్చుతుంది. ఆవేశం సినిమా అన్నీ రూల్స్‌ను బద్దలుకొట్టేసింది. ఒక సీన్ నుంచి మరో సీన్‍కు జానర్లే మారిపోయాయి. నేను ఈ సినిమా చూస్తూ భయపడ్డాను.. నవ్వాను.. భయపడ్డాను.. నవ్వాను. కొన్ని సినిమాలు తప్పకుండా థియేటర్లలోనే చూడాలి. ఇది కూడా అలాంటి చిత్రమే అని సమంత రాసుకొచ్చారు.స్టెరాయిడ్స్ తీసుకున్నట్టుగా ఫాఫా (ఫాహద్ ఫాజిల్) పర్ఫార్మెన్స్ ఉందని తాను ఎక్కడో చదివానని, ఇది సరిగ్గా సరిపోయిందని సమంత చెప్పుకొచ్చారు.ఫాఫా సినిమాలను అస్సలు మిస్ అవొద్దని ఆమె రాసుకొచ్చారు. 

అద్భుతమైన ఆవేశం టీమ్‍కు అభినందనలు తెలుపుతున్నానని, స్ఫూర్తివంతంగా నిలిచారని సమంత తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.ఆవేశం చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించగా హిప్‍స్టర్., మిథున్ జై చెంబన్ వినోద్, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్ మరియు ఆశిష్ విద్యార్థి ముఖ్య పాత్రలు చేశారు. రంగా అనే రౌడీ పాత్రలో ఫహాద్ నటన అందరినీ ఎంతగానో మెప్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: