చిరు మూవీలో విజయశాంతి..?

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసారా ఫేమ్ మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఈ సినిమాను యూ వి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం కూడా కంప్లీట్ అయింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ 26 రోజుల పాటు ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ యక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేశారు. ఈ ఇంటర్వెల్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఖరారు చేసింది. ఇలా ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులు చక చగా పూర్తి అవుతున్న వేళ ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

అదేంటంటే ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో విజయశాంతి కనిపించే అవకాశం ఉన్నట్లు , అందుకోసం ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక వేళ ఈమె కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే చిరు హీరోక్గా రూపొందుతున్న విశ్వంభర మూవీ లో విజయశాంతి ఓ కిలకమైన పాత్రలో కనిపించబోతున్నట్ల ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో చిరు హీరోగా రూపొందిన ఎన్నో సినిమాలలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. వీరిద్దరి జంటకు తెలుగు సినీ పరిశ్రమలో ఒక సూపర్ క్రేజ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: