అఫీషియల్ : "లవ్ మీ" విడుదల తేదీ వచ్చేసింది..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు తన సోదరుడి కుమారుడు అయినటువంటి ఆశిష్ ను రౌడీ బాయ్స్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. రౌడీ బాయ్స్ మూవీ తో నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం "లవ్ మీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది.
 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని మే 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేది ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆశిష్ మరియు వైష్ణవి చైతన్య ఉన్నారు. ఇందులో ఆశిష్ సోఫా లో కూర్చుని స్టైలిష్ లుక్ లో ఉండగా ... అతని వెనకాల వైష్ణవి చైతన్య నిలబడి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి రౌడీ బాయ్స్ సినిమాతో పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈయన "లవ్ మీ" మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఇతడి క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీతో ఆశిష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. ఇక బేబీ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న వైష్ణవి చైతన్య నటిస్తున్న ఈ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇలా "లవ్ మీ" సినిమా మంచి విజయం సాధించినట్లు అయితే ఆశిష్ , వైష్ణవి ఇద్దరి క్రేజ్ కూడా భారీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: