పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ఆదికేశవ బ్యూటీ..!!

Divya
మలయాళం లో కుర్ర హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ అపర్ణ దాస్.. అయితే సడన్గా వివాహ బంధంలోకి అడుగుపెట్టి అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే మలయాళం లో వరుసగా విజయాలు అందుకుంటున్న మంజుమ్మల్ బాయ్స్ లో నటించిన దీపక్ పరంబోల్ నీ పెళ్లి చేసుకుంది. ఈరోజు ఉదయం కేరళలోని గురువాయర్ ఆలయంలో సైలెంట్ గా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది అపర్ణ. వీరి వివాహం కూడా చాలా సింపుల్ గానే జరిగినట్టు కనిపిస్తోంది అందుకు సంబంధించి వీడియోలు ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

అపర్ణ, దీపక్ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోని జరిగినట్టుగా కనిపిస్తోంది. దీంతో పలువురు అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి దుస్తులను అపర్ణ, దీపక్ ఇద్దరు కూడా చూడముచ్చటైన జంటగా కనిపిస్తున్నారు. అపర్ణ భారీ బంగారు ఆభరణాలతో చాలా అందంగా కనిపిస్తోంది. దీపక్ సాంప్రదాయమైన దుస్తులలో కనిపించారు. అపర్ణ ,దీపక్ ఇద్దరు కలిసి మనోకరం అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి ఇరువురి కుటుంబాల అంగీకార సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
2018లో న్యాన్ ప్రకాషన్ సినిమాతో అపర్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత దాదా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆలా విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో కూడా మంచి క్రేజ్ అందుకుంది. అలా మనోహరం, ఆదికేశవ, సీక్రెట్ హోం వంటి చిత్రాలలో తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది. ప్రస్తుతం కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న వయసు నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండడంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అపర్ణ. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించి పలు ఫోటోలు వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: