"ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్" గురించి క్రేజీ విషయాలు చెప్పిన ప్రశాంత్ వర్మ..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈయన నాని నిర్మాణంలో రూపొందినటువంటి "అ!" సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన రాజశేఖర్ హీరోగా కల్కి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఆ తర్వాత ఈ దర్శకుడు జాంబి రెడ్డి మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన "ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్" అనే సిరీస్ లో భాగంగా హనుమాన్ అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇందులో తేజ సజ్జ హీరోగా నటించగా ... అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ తాజాగా విజయవంతంగా 100 రోజులను పూర్తి చేసుకుంది. దానితో ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ ను నిర్వహించింది. ఆ ఈవెంట్ లో భాగంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ... ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో చాలా మంది కొత్తవారిని పరిచయం చేయబోతున్నాం. దీని కోసం అన్ని ఇండస్ట్రీ ల నుండి స్టార్ నటులను కూడా ఎంపిక చేస్తామన్నారు. తన సినిమా నచ్చి పలువురు నటులు యూనివర్సిటీలో భాగం అవ్వాలని అడిగినట్లుగా కూడా ప్రశాంత్ పేర్కొన్నారు. ఇక హనుమాన్ మూవీ కి కొనసాగింపుగా జై హనుమాన్ మూవీ రాబోతుంది. ఈ సినిమా అన్ని భాగాల్లో అద్భుత స్థాయిలో ఉంటుంది అని ప్రశాంత్ వర్మ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pv

సంబంధిత వార్తలు: