సత్యభామ: కాజల్ సూపర్ థ్రిల్లర్ రిలీజ్ అప్పుడే?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన చందమామ కాజల్ అగర్వాల్.. పెళ్లి తరువాత రూట్ మార్చేసిన విషయం తెలిసిందే. యాక్షన్, ఫిమేల్ ఓరియెంటెడ్ రోల్స్ చేయడానికి ఆమె ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది.ప్రస్తుతం ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ గా సత్యభామ సినిమా తెరకెక్కుతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ కు జోడీగా ప్రస్తుతం ఓటిటిలో వరుస వెబ్ సిరీస్ చేస్తూ ఓటిటి స్టార్ హీరోగా దూసుకుపోతున్న యంగ్ హీరో నవీన్ చంద్ర నటిస్తున్నాడు. సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సూపర్ థ్రిల్లర్ సినిమాలో కాజల్ అగర్వాల్.. యాక్షన్ మోడ్‍ లో సీరియస్ క్యారెక్టర్ చేస్తుండడంతో మూవీ పై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా దానికి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ 90 శాతం పూర్తి చేశామని మేకర్స్ తెలిపారు. కాజల్ అగర్వాల్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా కష్టపడి ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ లు చేసింది.

తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే17వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ తో పాటు ఓ సూపర్ గ్లింప్స్  ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో కాజల్ అగర్వాల్ సీరియస్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ మ్యాప్ కనిపిస్తోంది. అందులో తెలంగాణ స్టేట్ తో పాటు మహారాష్ట్ర బోర్డర్ కూడా ఉంది.  ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా థియేటర్లలో చాలా థ్రిల్లింగ్ కి గురి చేసేలా ఉంది. పైగా కాజల్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాజల్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ హిట్ అనే టాక్ ఉంది.


తెలుగు, తమిళ భాషల్లో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలు ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాయో అందరికి తెలిసిందే. చాలా కాలం పాటు టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా రాణించి టాలీవుడ్ క్వీన్ అనిపించుకున్న కాజల్ ఇప్పుడు సత్యభామ సినిమాతో మళ్ళీ ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తుంది.ఈ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. పాన్ ఇండియా సూపర్ హిట్ మేజర్, గూఢచారి చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు స్క్రీన్‍ప్లే కూడా అందిస్తున్నారు. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లితో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


మిగిలిన టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే..కో ప్రొడ్యూసర్ గా బాలాజీ, సినిమాటోగ్రఫర్ గా  బి విష్ణు, సీఈవోగా కుమార్ శ్రీరామనేని, పీఆర్ఓగా జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: