రీరిలీజ్: గిల్లి రికార్డుని ఆ హీరోనే బద్దలు కొట్టాలి?

Purushottham Vinay
ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ తెలుగు, తమిళ భాషలలో జోరుగా సాగుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలని మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇలాంటి పాత సినిమాలకి ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది.అయితే కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే రీరిలీజ్ చేసిన సినిమాలని థియేటర్స్ లో ప్రదర్శిస్తున్నారు. రీసెంట్ గా తెలుగులో నాని జెర్సీ సినిమా రీరిలీజ్ అయ్యింది.రీరిలీజ్ అయిన సినిమాలకి మంచి కలెక్షన్స్ వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ అసోసియేషన్స్, కొంత మంది చిన్న నిర్మాతలు పాత హిట్ మూవీస్ ని కొనుగోలు చేసి రిలీజ్ చేయడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా రీరిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి నిలిచింది.ఆ మూవీ  ఏకంగా 7.46కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.అయితే పది రోజుల పాటు ఖుషి చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించారు. ఖుషి కలెక్షన్స్ రికార్డ్ ని ఇప్పటి దాకా ఏ టాలీవుడ్ మూవీ బ్రేక్ చేయలేకపోయింది. సూపర్ స్టార్ మహేష్ బిజినెస్ మ్యాన్ బ్రేక్ చేసేదే కానీ ఆ సినిమాని ఒక రోజు మాత్రమే ప్రదర్శించారు. ఒక రెండు రోజులు ప్రదర్శించిన ఖుషి వసూళ్ళని ఈజీగా దాటేది.


అయితే ఈ ట్రెండ్ లో కోలీవుడ్ నుంచి ఇళయదళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిల్లి ఇప్పుడు బ్రేక్ చేయడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ సూపర్ హిట్ మూవీ ఒక్కడు రీమేక్ గా తమిళంలో గిల్లి సినిమా తెరకెక్కింది.. తాజాగా గిల్లి మూవీని తమిళనాట రీరిలీజ్ చేశారు. ఈ సినిమాకి దళపతి అభిమానుల నుంచి ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఒక్క రోజులోనే ఈ సినిమాకి 7.92 కోట్ల గ్రాస్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా రికార్డ్ ని దళపతి గిల్లి మూవీ ఒక్క రోజులోనే జెట్ స్పీడ్ లో బ్రేక్ చేయడం విశేషం. ఈ సినిమా మరికొద్ది రోజులు థియేటర్స్ లో ప్రదర్శితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో డబుల్ డిజిట్ కలెక్షన్స్ ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు, ఖలేజా రీ రిలీజ్ లో  బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి. ఎందుకంటే మహేష్ పాత సినిమాలు అయిన ఒక్కడు, పోకిరి, బిజినెస్ మ్యాన్ కేవలం లిమిటెడ్ థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించాయి. ఇక గిల్లి రికార్డులను మహేష్ తరువాతి సినిమాలు బద్దలు కొడతాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: