అందుకే నాకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా రావడం లేదు... పరిణితి చోప్రా..!

MADDIBOINA AJAY KUMAR
హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమానులలో పరిణితి చోప్రా ఒకరు. ఈ బ్యూటీ తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించింది. అందులో కొన్ని మూవీ లు మంచి విజయాలను కూడా సాధించాయి. దానితో ప్రస్తుతం ఈమె హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె అమర్ సింగ్ చెంకిల అనే మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం నుండే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించిన పరిణితి చోప్రా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తనకు ఎందుకు వరుస సినిమా అవకాశాలు రావడం లేదు అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చింది. తాజాగా పరిణితి చోప్రా మాట్లాడుతూ ... నేను ఎలాంటి పాత్రను అయినా పోషించడానికి రెడీగా ఉంటాను.

అలాగే అందులో నా నటనతో 100% ప్రేక్షకులను అలరించడానికి నేను ఏమైనా చేస్తాను. కాకపోతే పి ఆర్ మేనేజర్ కారణంగా ఎన్నో అవకాశాలను నేను కోల్పోయాను అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. నా మూవీ కెరీర్ యాక్టివ్ గా లేకపోవడానికి ప్రముఖులతో సంబంధాలు పెంచుకోకపోవడం , వారి ఇళ్లలో పార్టీలు , ఫంక్షన్ లకి వెళ్లకపోవడం అని వల్ల ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pc

సంబంధిత వార్తలు: