నా ఫేవరెట్ హీరో ఆయనే : హీరో విశాల్

praveen
సాధారణం గా సినిమా హీరోలకు కోట్లాది మంది అభిమానులు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే  హీరోల సినిమాలను ఎంతగానో ఆదరిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. అయితే సాధారణ సినీ ప్రేక్షకులు ఎలా అయితే ఇక హీరోలను అభిమానిస్తూ ఉంటారో అచ్చం ఇలాగే హీరోలకు కూడా ఫేవరెట్ హీరోలు ఉంటారు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఇలాంటి వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచు కోవడానికి ఇష్ట పడుతూ ఉంటారు హీరోలు.

 తమ ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని సోషల్ మీడియా లో చెప్పడం చేస్తూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. అయితే ఇలా ఎవరైనా హీరో తన ఫేవరెట్ హీరో గురించి చెప్పాడు అంటే చాలు అదికాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. కాగా ఇటీవలే తమిళ స్టార్ హీరో విశాల్ కూడా తన ఫేవరెట్ హీరో ఎవరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన కోటి హీరో  పేరే విశాల్ చెప్పడం గమనార్హం. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు విశాల్. ఇప్పుడు రత్నం అనే మూవీతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.

 అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్లో మాట్లాడిన స్టార్ హీరో విశాల్ దళపతి విజయ్ తన అభిమాన నటుడు అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ కోసం ఒక కథ రాశాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోవిడ్ తర్వాత ఆయన అపాయింట్మెంట్ కోసం కూడా ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. దీనికోసం ప్రత్యేకంగా ప్లాన్ చేయడం లాంటివి ఏదీ లేదని ఫ్యూచర్లో వర్క్ అవుట్ అయితే తప్పకుండా సినిమా చేస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో విశాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: