నాక్కూడా ఏం తెలీదు.. మహేష్ - రాజమౌళి మూవీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
బాహుబలి తర్వాత అటు రాజమౌళి క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఆయన నుంచి రాబోయే సినిమాలపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వేదికలపై కూడా జక్కన్న తన దర్శకత్వ ప్రతిభతో సత్తా చాటాడు. ఇక ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రాజమౌళి. అయితే ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.

ఇక మహేష్ బాబుని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనే విషయంపై చర్చ జరుగుతుంది. అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్క పోతుంది అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే మహేష్ బాబుతో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన స్టోరీ పనులు పూర్తయ్యాయని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ వార్తలు తెరమీదకి వస్తూ ఉన్నాయి. అయితే రాజమౌళి తన సినిమా కథ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

 సాధారణంగా  అయితే ఇక ఒక సినిమాను ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నాడు అంటే సినిమా కథ ఏంటి అన్న విషయం తెలిసే ఉంటుంది. కానీ తనకు మాత్రం రాజమౌళి తెరకెక్కించబోయే  సినిమా కథ తెలియదు అంటూ ఇక్కడ ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి రాజమౌళికి తప్ప ఎవరికీ తెలియదు. స్టోరీ షూటింగ్ క్యాస్టింగ్ రిలీజ్ వంటి అంశాలు రాజమౌళికి ఒక్కరికి తెలుసు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ అటు నిర్మాత గోపాల్ రెడ్డి చెప్పకు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: