ఏంటి చరణ్ కమల్ కంటే తోపా..?

Purushottham Vinay
తమిళ డైరెక్టర్ శంకర్ వరుసగా రెండు పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బాగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్  షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.తమిళ్ నుంచి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ సిద్ధం అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. మరో వైపు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉంది. తెలుగు నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ రెండు సినిమాలని భారీగానే డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. భారతీయుడు 2 మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడుకి సీక్వెల్ గా మేకింగ్ అవుతోంది. అయితే మార్కెట్ లో భారతీయుడు 2 సినిమా కంటే గేమ్ చేంజర్ సినిమాకి ఇప్పుడు ఎక్కువ హైప్ ఉంది. బిజినెస్ పరంగా చూసుకున్న గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ డిమాండ్ ఉండటం విశేషం.


తాజాగా గేమ్ చేంజర్ సినిమా హిందీ థీయాట్రికల్ రైట్స్ ని అనిల్ తడాని ఏకంగా 75 కోట్లకి కొనుగోలు చేశారు. అయితే అదే భారతీయుడు 2 హిందీ వెర్షన్ థీయాట్రికల్ రైట్స్ మాత్రం కేవలం 20 కోట్లకి మాత్రమే వెళ్ళింది. ఈ డీల్ ని బట్టి కమల్ హాసన్ కంటే రామ్ చరణ్ కి ప్రస్తుతం దేశీయంగా ఎక్కువ మార్కెట్ ఉందని క్లియర్ గా అర్ధమవుతోంది. ఇంకా అలాగే డిజిటల్ రైట్స్ విషయంలో కూడా గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ ఆఫర్స్ లభిస్తున్నాయని టాక్.ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో రామ్ చరణ్ ఇమేజ్ దేశావ్యాప్తంగా అమాంతం పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ బ్రాండ్ తో దేశవ్యాప్తంగా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. అయితే కమల్ హాసన్ సీనియర్ హీరోగా ఉన్నా కూడా కోలీవుడ్ కి మాత్రమే ప్రస్తుతం పరిమితం అయ్యారు. అప్పట్లో పాన్ ఇండియా హీరోగా సినిమాలు చేసిన తరువాత ఫేడ్ ఔట్ అయ్యారు. కానీ ఆయన నుంచి వచ్చిన చివరి చిత్రం విక్రమ్ మాత్రం తెలుగు తమిళ భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన నార్త్ లో మాత్రం అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: