అంతర్జాతీయ వేదికపై మలయాళీ మూవీ వడక్కన్.. దేశ సినిమా ఖ్యాతిని పెంచిందిగా!

Reddy P Rajasekhar
కిషోర్, శృతి మీనన్ జంటగా నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరవడం సినీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. రసూల్ పోకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ ఈ సినిమాను నిర్మించగా సాజీద్ ఎ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వడక్కన్ మూవీ స్థానం సంపాదించుకుని వార్తల్లో నిలిచింది. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది.
 
మస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా ఎదురైన అనుభవాలకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ వడక్కన్ సినిమాకు లభించిన అరుదైన గౌరవం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వడక్కన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
 
మలయాళ సినిమా ఇండస్ట్రీని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలు భాషతో సంబంధం లేకుండా సంచలనాలు సృష్టించగా వడక్కన్ మూవీ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత, జైదీప్ సింగ్ ఈ సినిమాకు దక్కిన అరుదైన గౌరవం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
వడక్కన్ తరహా సినిమాలతో భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యం అని ఆయన వెల్లడించడం గమనార్హం. మన దేశ ఖ్యాతిని, భారతీయ సినిమాల స్థాయిని పెంచే ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. కేన్స్‌లో మే నెలలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లోకి డబ్ కానున్న ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. వడక్కన్ ఇతర సౌత్ భాషల్లో సైతం సంచలనాలు సృష్టించడం ఖాయమని ఈ సినిమా యూనిట్ కాన్ఫిడెన్స్ తో ఉంది.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: