మరో సాహసం చేయడానికి సిద్ధమైన జాన్వీకపూర్..!?

Anilkumar
ధడక్ సినిమాతో నటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది జాన్వి కపూర్. దిగవంత హీరోయిన్ శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన నటనతో సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వహిస్తూ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే మొదటి నుండి జాన్వి అంటే తెలుగు ఆడియన్స్ లో ఒక ప్రత్యేక గుర్తింపు. ఇప్పటివరకు కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం చేస్తూ ముందుకు వెళ్తోంది జాన్వి. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కథాకథనం తన పాత్ర ఎలా ఉంది

 అన్న విషయాలను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అలా ఆమె చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్స్ అవ్వడంతో విమర్శలను సైతం ఎదుర్కొంది. కానీ ఇప్పుడు అవి సినిమాల్లో నటించి ప్రశంసలను అందుకుంటుంది. అయితే జాన్వి కపూర్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సౌత్ ని ఇండస్ట్రీ పైనే ఉంది. ప్రస్తుతం తెలుగులో రెండు భారీ సినిమాల్లో నటిస్తోంది జాన్వి కపూర్. అటు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

దాంతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం సైలెంట్ గా మరొక కొత్త సినిమా టీజర్ విడుదల చేసింది. జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉలజ్’. సుధాన్షు సరియా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని జంగ్లీ పిక్చర్స్ బ్యానర్ పై వినీత్ జైన్ నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ గా కనిపించనుంది. దేశానికి, విదేశాంగ శాఖకు సంబంధించిన కథగా.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ఉలజ్ టీజర్ అదిరింది. అందులో జాన్వీ మరోసారి యాక్టింగ్ తో ఆశ్చర్యపరిచింది. అలాగే యాక్షన్ సీక్వెన్లతోనూ మెప్పించినట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: