కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఛాన్సులు రావడం లేదు: నటి హిమజ..!

Anilkumar
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకొని బిగ్ బాస్ వరకు వెళ్లి నటి హిమజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా ఆమె సినిమా ఆఫర్స్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే సుమారు పది సంవత్సరాల క్రితం సీరియల్స్ ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. 2013లో రామ్ నటించిన శివమ్ సినిమా లో నటించి తరువాత సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దాని తర్వాత నేను శైలజ శతమానంభవతి వరుడు కావలెను వంటి సినిమాలతో పాటు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. 

సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కొంచెం ఇష్టం కొంచెం కష్టం తోపాటు మరికొన్ని సీరియల్స్ లో సైతం నటించింది. బిగ్ బాస్ 3 సీజన్ లో కంటెస్టెంట్ గా వెళ్లిన హిమజా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తెలుగు అమ్మాయిలు ఒకప్పుడు రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌ ఇస్తేనే ఛాన్సులు వస్తాయి అనుకోవడం తప్పు..

విషయం ఏమిటంటే కమిట్‌మెంట్‌ ఇచ్చిన వాళ్లందరికీ కూడా ఆఫర్స్ రావడం లేదు. అలా అని అవకాశాలు అందుకున్న వారందరూ కమిట్‌మెంట్‌ ఇచ్చినవాళ్లు కాదు. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇక్కడ ఆఫర్స్‌ ఇస్తారు.. వారిలో ఏం నచ్చిందో తెలియదు. ఒక్కోసారి తెలుగు అమ్మాయిలు కూడా హీరోయిన్‌ అయితేనే చేస్తాను అనే వారు కూడా ఉన్నారు. అది చాలా తప్పు. ఫస్ట్‌ అవకాశం వస్తే తీసుకొని సద్వినియోగం చేసుకుంటే ఏదోరోజు మంచి భవిష్యత్‌ ఉంటుంది. నా వరకు అయితే హీరోయిన్‌ మాత్రమే కావాలని రాలేదు. నాకు ఏ అవకాశం వచ్చినా చేస్తాను.  తెలుగు అమ్మాయి అయిన హిమజ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమెను చూసిన వారు ఎవరైనా సరే హీరోయిన్‌ మెటీరియల్‌ అనాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: