"తండెల్" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఇదే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి నాగచైతన్య ప్రస్తుతం తండాల్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీకి చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు.

ఇక తమిళ నటుడు ఆడుకాలం నరేన్, చరణ్‌దీప్ మరియు మహేష్ ఆచంట ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఇకపోతే గతంలో నాగచైతన్య చందు మండేటి కాంబోలో సవ్యసాచి ప్రేమ అనే రెండు మూవీలు రూపొందాయి ఈ రెండు మూవీలు కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశపరిచాయి అయినప్పటికీ కార్తికేయ టు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడం ఇందులో నాగచైతన్య హీరోగా కనిపించడం ఉండడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమా నుండి కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ తాజా షెడ్యూల్ "బీ హెచ్‌ ఈ ఎల్‌" లో ఏర్పాటు చేసిన జైలు సెట్ లో చిత్రీకరణ జరిగింది. తదుపరి షెడ్యూల్ మే 2 న ప్రారంభమై మే 18 వరకు కొనసాగుతుందట. కాగా ఈ మూవీ ని అన్ని కార్యక్రమాలు ముగించి అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. గతంలో నాగ చైతన్య , సాయి పల్లవి కాంబోలో లవ్ స్టోరీ మూవీ రూపొందింది. ఇందులో వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు వచ్చాయి. మరి తండెల్ మూవీ లో వీరి జంట ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: