పరశురామ్ పరిస్థితి పై ఆశక్తికర చర్చలు !

Seetha Sailaja
2018లో విడుదలైన ‘గీత గోవిందం’ మూవీతో ఒక్కసారిగా దర్శకుడు పరుశురామ్ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. దీనితో అతడికి అనేక మీడియం రేంజ్ సినిమాల ఆఫర్లు వచ్చాయి. అయితే టాప్ హీరోతో తన తదుపరి సినిమాను చేయాలి అన్న తాపత్రయంతో సుమారు మూడు సంవత్సరాలు ఖాళీగా కూర్చుని ఎట్టకేలకు క్రితం సంవత్సరం సమ్మర్ లో ‘సర్కారువారి పాట’ మూవీని మహేష్ తో తీశాడు.

ఈమూవీకి 100 కోట్ల కలక్షన్స్ వచ్చినప్పటికీ ఈమూవీని ఏవరేజ్ హిట్ గా ఇండస్ట్రీ వర్గాలు పరిగణించడంతో పరుశురామ్ కు ఈమూవీ ద్వారా చెప్పుకోతగ్గ స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో పరుశురామ్ మరొక సినిమాను తీయడానికి చాల ఆలస్యం అయింది. ఈమూవీలో మహేష్ నటన బాగున్నప్పటికీ ఈమూవీ స్క్రీన్ ప్లే విషయంలో పరుశురామ్ చేసిన పొరపాట్లు వల్ల ఇతడు కొంతకాలం క్రితం మహేహ అభిమానుల చేత టార్గెట్ కాబడినట్లు వార్తలు కూడ వచ్చాయి.

లేటెస్ట్ గా విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ కథలో కానీ కథనంలో కానీ ఎటువంటి స్పెషాలిటీ పరుశురామ్ చూపెట్టలేకపోవడంతో పరుశురామ్ ఇండస్ట్రీ నుండి ముఖ్యంగా టాప్ హీరోల నుండి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ పరుశురామ్ కు రాలేదు అన్నప్రచారం జరుగుతోంది. వాస్తవానికి పరుశురామ్ నాగచైతన్య కాంబినేషన్ లో ఒక భారీ యాక్షన్ మూవీకి రంగం సిద్ధం అయినప్పటికీ ఆసినిమా క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందే.  

దర్శకుడు దిల్ రాజ్ పరుశురామ్ ‘ఫ్యామిలీ స్టార్’ తీస్తున్న రోజులలో తనకు మరో సినిమా చేసి పెట్టమని అడిగాడని అంటారు. దిల్ రాజ్ ఆస్థానంలో వంశీ పైడిపల్లి వేణు శ్రీరామ్ లకు వరసపెట్టి అవకాశాలు వస్తున్న రీతిగా పరుశురామ్ కు కూడ దిల్ రాజ్ మరొక అవకాశం ఇవ్వవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఫ్యామిలీ స్టార్’ ఫలితంతో భయపడకుండా పరుశురామ్ చెప్పిన కథ విని ఏ టాప్ హీరో ముందుకు వస్తాడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: