గత రెండు సంవత్సరాలుగా వరుస ఫ్లాప్ లతో బాధపడుతోంది బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీకి గత రెండేళ్లుగా మాత్రం అసలు కలిసి రావడం లేదు. అయినప్పటికీ కూడా తగ్గేదే అంటోంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత రెండేళ్లుగా ఈ బ్యూటీ ఏ సినిమా చేసినా కూడా ఫ్లాప్ అవుతోంది. అంతే కాకుండా తాను చేయబోయే కమిట్ అయిన సినిమాలు కూడా ఆగిపోతూ వస్తున్నాయి. గుంటూరు కారం సినిమా ముందు పూజా హెగ్డే చేయాల్సింది. కానీ అనూహ్యంగా గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకుంది.
ఆ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో చేయాల్సిన జనగణమన సినిమా సైతం ఆగిపోయింది. ఇలా ఈమె కమిట్ అయిన సినిమాలన్నీ కూడా ఆగిపోయాయి. ఈ సినిమాలు కంటే ముందు ఈమె చేసిన పాన్ ఇండియా సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. రాదే శ్యాం బీస్ట్ ఆచార్య వంటి సినిమాలు తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి అక్కడ కూడా ఫ్లాప్ అయ్యింది పూజ హెగ్డే. అయితే ఒక రకంగా ఈమె చేసిన సినిమాలు అన్నిటికీ కూడా నష్టమే జరిగింది. దాదాపుగా సినిమాలన్నీ కలిపి 350 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది.
దాంతో పూజ కి ఐరన్ లెగ్ అన్న ముద్ర కూడా పడింది .అయినప్పటికీ ఈమె జోరు మాత్రం తగ్గించడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏమాత్రం పట్టించుకోకుండా పర్సనల్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ పాన్ ఇండియన్ హీరోయిన్ ప్రస్తుతం కోట్లు పెట్టి కొత్త ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. అది కూడా ముంబయ్ లో సముద్రం సమీపంలో 45 కోట్ల రూపాయలతో లగ్జరీ హౌస్ ను ఆమె కొనుగోలు చేసిందట. త్వరలో పూజా హెగ్డే తన కొత్త ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. 4,000 చదరపు అడుగుల స్పేస్ ఉన్న ఈ ఇంటి విలువ 45 కోట్లకు పైనే ఉండొచ్చని చెబుతున్నారు.