బాలీవుడ్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్..!?

Anilkumar
గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దాదాపుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏడాదిన్నర నుండి జరుగుతోంది. భారీ అంచనాల నడుమ నెక్స్ట్ లెవెల్ లో ఈ సినిమాను తీస్తున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సైతం ఈ సినిమాపై చాలా నమ్మకం గా ఉన్నారు. ఖచ్చితంగా దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని కోరుకుంటున్నారు. అయితే ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.

 జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఇప్పటికే వార్ 2 సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ యశ్ రామ్ ఫిలిమ్స్ బ్యానర్లో మరొక సినిమాలో నటిస్తున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సినిమాతో పాటు కరణ్ జోహార్ బ్యానర్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం. కరణ్ జోహార్ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇన్నాళ్లు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న

 జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. అంతేకాదు ఒకింత టెన్షన్ కూడా పడుతున్నారు. ఎందుకంటే బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతే టాలీవుడ్ కి దూరమవుతారేమో అని..  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తాము గర్వపడే సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ నటించాలని కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ క్రేజ్ పరంగా మరింత ఎదిగేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ కు ఇప్పటికే నార్త్ ఇండియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: