నాతో నటించేందుకు.. హీరోలు ఇష్టపడరు : హీరోయిన్

praveen
విద్యాబాలన్.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ విద్యాబాలన్ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. విద్యాబాలన్ ఏదైనా సినిమాలో నటించింది అంటే హీరోకు సరితూగే పాత్రలోనే నటించడానికి ఒప్పుకుంటుంది అని ప్రేక్షకుల భావన. ఎందుకంటే ఇప్పటివరకు ఆమె కెరియర్ లో చేసిన సినిమాలన్నీ అలాగే ఉంటాయి. అంతేకాకుండా గ్లామర్ ఓలక బోయడంలో విద్యాబాలన్ ఎక్కడ వెనకడుగు వేయదు. అలాగే చాలెంజింగ్ రోల్స్ చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది ఈ హీరోయిన్.

 మరోవైపు తన దగ్గరికి సినిమా ఆఫర్స్ తో వస్తే దర్శక నిర్మాతలకు ఇక కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటుందట. ఇలా విద్యాబాలన్  పెట్టే కండిషన్స్ అప్పుడప్పుడు ఇక ఇండస్ట్రీలో కూడా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఇలా కండిషన్స్ పెట్టడం కారణంగానే విద్యాబాలన్ కు అటు అవకాశాలు తగ్గాయి అని కూడా అంటూ ఉంటారు. హీరోల సరసన నటించే అవకాశాలు దక్కినప్పటికీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఇక ప్రస్తుతం బిజీబిజీగానే గడుపుతుంది ఈ అమ్మడు. అయితే ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది విద్యాబాలన్   తనతో నటించడానికి హీరోలు పెద్దగా ఇష్టపడరు అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది.

 లేడీ ఓరియంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని.. అయితే కొందరు నటులు దాని సహించలేరు అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. తాను ఎక్కువగా అలా లేడీ ఓరియంటెడ్ సినిమాలో చేయడం వల్లే తనతో నటించేందుకు హీరోలు పెద్దగా ఆసక్తి చూపించరు అంటూ తెలిపింది. అయితే సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉంటుంది అనే అంశాన్ని ఆమె కొట్టిపారేశారు. అలా బందు ప్రీతి ఉంటే ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ అందరూ కూడా సక్సెస్ అయ్యే వారు అంటూ చెప్పుకొచ్చింది. కేవలం తన నటన టాలెంట్ వళ్ళే అవకాశాలు దక్కాయని తన బ్యాక్ గ్రౌండ్ చూసి కాదు అని చెప్పింది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: