తండ్రయిన మంచు మనోజ్.. వైరల్ అవుతున్న మంచు లక్ష్మి ట్వీట్..!!

murali krishna
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తండ్రి అయ్యారు.. అతడి భార్య మౌనిక శనివారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి, నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.ఈ చిన్నారికి ఎమ్ఎమ్ పులి అనే నిక్ నేమ్ పెట్టినట్లు కూడా మంచు లక్ష్మి తెలిపింది. ఆ పరమ శివుడి ఆశీస్సులతో తమ ఇంట్లోకి ఓ చిన్నారి దేవత అడుగుపెట్టినట్లు మంచు లక్ష్మి ఈ ట్వీట్‌లో పేర్కొన్నది. ఎమ్ఎమ్ పులి రాకతో అన్నగా మారిన ధైరవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని మంచు లక్ష్మి చెప్పింది. మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.గత ఏడాది మార్చి లో మంచు మనోజ్‌, మౌనిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.  మోహన్‌బాబు గారి ఇంట్లో మనోజ్‌, మౌనిక పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటు కొద్ది మంది స్నేహితులు హాజరయ్యారు.

మనోజ్‌తో పాటు మౌనికకు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతిని ప్రేమించి పెళ్లాడిన మనోజ్‌ మనస్పర్థలతో 2019 లో విడాకులు తీసుకున్నాడు..అలాగే మౌనిక కూడా తన మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకు ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. మనోజ్ కి ఆడ బిడ్డ పుట్టడంతో మంచు ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. మనోజ్ కి అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు..ఇదిలా ఉంటే దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఇటీవలే ఉస్తాద్ అనే టాక్ షోతో మనోజ్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ టాక్ షో ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది..ప్రస్తుతం మనోజ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. వాట్ ది ఫిష్ పేరుతో ఓ మూవీని అనౌన్స్‌చేసిన విషయం తెలిసిందే..అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: