థియేటర్లో ఫట్... బుల్లితెరపై హిట్... ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రిపోర్ట్ ఇదే..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు నితిన్ కొంతకాలం క్రితం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీలా ఈ మూవీలో హీరోయిన్గా నటించగా... ప్రముఖ కథా రచయిత మరియు దర్శకుడు అయినటువంటి వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథను అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలాగే ఈ మూవీ విడుదలకు ముందు ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. అలా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోయింది. దానితో ఈ మూవీ ఫ్లాప్ గా మిగిలింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెరపై ప్రచారం అయ్యింది.

ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీని మొదటిసారి బుల్లితెరపై ప్రసారం చేసినప్పుడు ఈ మూవీకి 5.16 టిఆర్పి రేటింగ్ దక్కింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయిన ఈ సినిమాకు బుల్లితెరపై ఈ స్థాయి టిఆర్పి రేటింగ్ దక్కడం అంటే ఈ మూవీ స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నట్లు చెప్పవచ్చు.

అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫట్ అయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం మంచి హిట్ అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం నితిన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే మూవీలోనూ ... వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీలోను హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీలపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: