ఆ మూవీ రీ రిలీజ్ కి సూపర్ రెస్పాన్స్... ఆనందాన్ని అలా వ్యక్తం చేసిన తమన్నా..!

MADDIBOINA AJAY KUMAR
మిల్కీ బ్యూటీ తమన్నా "హ్యాపీ డేస్" మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమెకు తెలుగు సినీ పరిశ్రమ నుండి మంచి సినిమా అవకాశాలు దక్కడం... అందులో భాగంగా ఈమె నటించిన చాలా టాలీవుడ్ మూవీ లు సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలో లభించింది. ఇక ఆ టైంలో ఈ బ్యూటీ తెలుగు తో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించడం మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో కార్తి హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ అడ్వెంచర్స్ మూవీ "పైయా" లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు లో "ఆవారా" పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా అటు తమిళ్ లోను ... ఇటు తెలుగు లోనూ అద్భుతమైన విజయం అందుకుంది. 2010 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమాను తాజాగా తమిళ్ లో రిలీజ్ చేశారు.

ఈ మూవీ రీ రిలీస్ గురించి అక్కడ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూశారు. ఇక తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ కావడంతో ఈ మూవీ కి తమిళ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో తమన్నా ఈ మూవీ డైరెక్టర్ లింగుస్వామి తో ఈ సినిమా జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.

అందుకు సంబందించిన చిన్న గ్లింప్స్ ను కూడా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తమన్నా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం కూడా తమన్నా వరుస సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే తాజాగా తమన్నా "అరుణ్మనై 4" అనే తమిళ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: