ఆ ఛాన్స్ కోసం.. 28 ఏళ్ళు ఎదురు చూశా : హీరోయిన్

praveen
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంజయ్ లీలా బన్సాలికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ.. సంజయ్ లీల బన్సాలి తెరకెక్కించే సినిమాలకు.. ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఆయనతో పాటు కలిసి పనిచేయాలని స్టార్ హీరోలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలో ఛాన్స్ వచ్చేసింది అంటే చాలు ఎంతో సంతోష పడిపోతూ ఉంటారు.

 అయితే అలాంటి ఛాన్స్ తనకు ఏకంగా 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చింది అంటూ చెబుతున్నారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మనిషా కొయిరాలా. అప్పట్లో మనిషా కొయిరాలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతల హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల అందరితో కూడా జతకట్టి పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది. కేవలం హిందీలో మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈమె సుపరిచితురాలు. ఎందుకంటే బొంబాయి ఒకే ఒక్కడు లాంటి సినిమాలలో నటించినా.. ఈ సీనియర్ హీరోయిన్ తెలుగులో కూడా కోట్లాదిమంది సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే గతంలో 1996లో సంజయ్ లీల బన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఖామోష్ మూవీలో నటించింది మనీషా.

  ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన హీరామండీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది మనిషా కోయిరాలా. సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో నటించేందుకు 28 ఏళ్ల పాటు ఎదురు చూశాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా విభిన్నమైన కథాంశం తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ ద్వారా మనిషా కోయిరాల సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని అవకాశాలు అందుకోవాలని చూస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: