టిల్లు స్క్వేర్: చెప్పినట్టే 100 కోట్లు కొట్టి చూపించారు?

Purushottham Vinay
టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ రోజు నిర్మాత నాగవంశీ.. ఈ సినిమా ఖచ్చితంగా వంద కోట్ల కలెక్షన్లు సాధిస్తుంటే చాలామంది పని పాట లేనోళ్ళు సోషల్ మీడియాలో కామెడీ చేశారు. కట్ చేస్తే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది, ఓపెనింగ్సూ భారీగా వచ్చాయి.ఈ మూవీ రెండో వీకెండ్ పూర్తి కాకముందే వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి వావ్ అనిపించింది. తొమ్మిది రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 'టిల్లు స్క్వేర్' వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టడం విశేషం. ఇక పారితోషకాలు పక్కన పెడితే.. 'టిల్లు స్క్వేర్' సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పది కోట్ల లోపే. అలాంటిది ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా అదిరిపోయే వసూళ్లు సాధించింది. దాదాపు 3 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.నైజాం ఏరియాలో పెద్ద హీరోల సినిమాల రేంజిలో 'టిల్లు స్క్వేర్' సినిమాకు వసూళ్లు వచ్చాయి. పైగా ఇక్కడ ఆల్రెడీ గ్రాస్ రూ.30 కోట్ల మార్కును దాటేసింది. ఫుల్ రన్లో 'టిల్లు స్క్వేర్' సినిమా ఇక్కడ రూ.20 కోట్లకు పైగా షేర్ సాధించబోతోంది.


వరల్డ్ వైడ్ 'టిల్లు స్క్వేర్' సినిమా హక్కులని ఫ్యాన్సీ రేటుకు తీసుకున్న అందరూ తొలి వీకెండ్లోనే లాభాల బాట పట్టారు. దాదాపుగా పెట్టుబడి మీద రెట్టింపు షేర్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. అంటే ఇది ఆల్రెడీ డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిపోయింది. రెండో వీకెండ్లో కూడా ఈ మూవీకి మంచి ఆక్యుపెన్సీలు వస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో కూడా హౌస్ ఫుల్స్ కూడా పడుతున్నాయి. ఈ వారం వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా దారుణమైన నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం వల్ల 'టిల్లు స్క్వేర్' హవా ఇంకా బాగా కొనసాగబోతోంది. మొత్తానికి చెప్పి మరీ ఈ రేంజ్ లో 100 కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాకి ఇప్పటికే 25 కోట్ల లాభం వచ్చినట్లు సమాచారం తెలుస్తుంది.అంటే పెట్టిన బడ్జెట్ ఇంకా జరుపుకున్న బిజినెస్ కంటే ఈ సినిమా ఎక్కువ వసూళ్ళని నమోదు చేసి ఈ సంవత్సరం హనుమాన్ సినిమా తరువాత ఎక్కువ లాభాలు సాధించిన సినిమాగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: