విజయ్ ఆఖరి 8 మూవీలకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ ఆఖరుగా నటించిన 8 మూవీలకి రిలీజ్ అయిన ఫస్ట్ డే రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ తాజాగా "ఫ్యామిలీ స్టార్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

విజయ్ కొంతకాలం క్రితం ఖుషి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 9.87 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. 

 విజయ్ హీరోగా రూపొందిన "లైగర్" మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.57 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

ఇక ఈ మూవీ కంటే ముందు విజయ్ "వరల్డ్ ఫేమస్ లవర్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

విజయ్ ఈ మూవీ కంటే ముందు డియర్ కామ్రేడ్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.50 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

ఈ మూవీ కంటే ముందు విజయ్ "టాక్సీవాలా" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

ఈ మూవీ కంటే ముందు విజయ్ "నోట" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4.55 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 

ఈ మూవీ కంటే ముందు విజయ్ "గీత గోవిందం" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.81 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: