గోట్@100 కోట్లు: సూపర్ సెంచరీ కొట్టిన గోట్?

Purushottham Vinay
ఒకప్పుడు మలయాళ సినిమాలు 50 కోట్లు కలెక్షన్స్ రాబట్టడమే పెద్ద విషయం. కానీ ఇప్పుడు కేవలం వంద కోట్లు మాత్రమే కాదు , రెండు వందల కోట్లతో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నాయి.ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం మలయాళం సినిమా ఇండస్ట్రీకి మరుపురాని సంవత్సరంగా మిగిలిపోతుంది.ఈ సంవత్సరం మలయాళం సినిమా ఇండస్ట్రీకి మంచి శుభారంభంగా నిలిచింది.అయితే ఇలా వసూళ్ల సునామీ సృష్టిస్తున్న చిత్రాల్లో దాదాపు మంచి కంటెంట్ తో కూడిన సర్వైవల్ థ్రిల్లర్స్‌ ఉండడం గమనార్హం. మలయాళ పరిశ్రమలో తెరకెక్కిన 2018, మంజుమ్మల్ బాయ్స్, ఆడు జీవితం - ది గోట్ లైఫ్.. సర్వైవల్ థ్రిల్లర్స్‌ గానే ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి.2018 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.177 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంటే, ఇటీవల వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా 220 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇంకా ఆ కలెక్షన్స్ కౌంట్ ని కొనసాగిస్తూనే ముందుకు తీసుకు వెళ్తుంది ఆ సినిమా.


ఇక రీసెంట్ గా రిలీజైన పృథ్విరాజ్ సుకుమారన్ ఆడు జీవితం - ది గోట్ లైఫ్ సినిమా కూడా సర్వైవల్ థ్రిల్లర్స్‌ గానే ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.తాజాగా ఈ సినిమా కూడా 100 కోట్ల మార్క్ ని ఈజీగా క్రాస్ చేసేసింది. మార్చ్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజైన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలియజేసారు. కాగా ఈ మూవీకి థియేటర్స్ వద్ద ఆదరణ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి.ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా బాగా వసూలు చేస్తుంది.పృథ్వి రాజ్ నటనకి ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మ రథం పడుతున్నారు.మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో చూడాలి.తెలుగులో కూడా మంచి వసూళ్లు రాబడుతుంది.ప్రేమలు సినిమా తరువాత గోట్ సినిమాకి కూడా తెలుగులో మంచి ఆదరణ పెరుగుతుంది.ప్రేమలు సినిమా కూడా 100 కోట్లు వసూళ్లు రాబట్టి తెలుగులో కూడా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: