అలా అని జూ.ఎన్టీఆర్ ను అవమానించిన అలీ...!!
యమదొంగ సినిమా సమయంలో ఎన్టీఆర్ లుక్ పట్ల ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు కమెడియన్ అలీ కూడా నటించారు వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యాయని చెప్పాలి అయితే ఈ సినిమా సమయంలో తన శరీర బరువు గురించి ఎన్టీఆర్ అలీ దగ్గర ప్రస్తావించారట. అలీ అన్న ఇప్పుడు నేను ఎలా ఉన్నానని ఎన్టీఆర్ అడగగా అలీ తన శరీర బరువు గురించి చేసిన కామెంట్స్ ఓ సందర్భంలో తారక్ అందరితో పంచుకున్నారు. నేను ఎలా ఉన్నాను అన్న అంటూ అలీ గారిని అడగడంతో ఆయన ఒక్కసారిగా నా శరీర బరువు గురించి మాట్లాడుతూ ఇంతకుముందు హరికృష్ణ గారికి తండ్రిలాగా ఉండే వాడివి. ఇప్పుడు ఎన్టీఆర్ కి కొడుకు లాగా ఉన్నావు అంటూ ఆయన మాట్లాడారు. ఆ విధంగా అలీ అన్న మాట్లాడటంతో ఏంటన్న అంత మాట అనేసావు నేను అంత చెండాలంగా ఉండే వాడిన అంటూ ఎన్టీఆర్ బాధపడ్డారట.ఇక అలీ తనని హరికృష్ణ గారికి తండ్రిలాగా ఉన్నాను అని చెప్పడంతో కొంత హ్యాపీగా కూడా అనిపించింది హరికృష్ణ గారికి తండ్రి అంటే సాక్షాత్తు ఎన్టీఆర్ గారే కదా నన్ను ఎన్టీఆర్ గారితో పోల్చడం చాలా హ్యాపీగా ఉంది అన్న అంటూ తనతో చెప్పానని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ శరీర బరువు గురించి ఆలీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.