గీతాంజలి ట్రైలర్ రివ్యూ: మరో డిఫరెంట్ హారర్ మూవీ?

Purushottham Vinay
హరర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇదివరకే ఈ మూవీకి సంబంధించిన టీజర్ సాంగ్స్ విడుదల చేయగా ఇప్పుడు మేకర్స్ ట్రైలర్‌ ను కూడా రిలీజ్ చేశారు.2014 లో వచ్చిన గీతాంజలి సినిమా మంచి హిట్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. ఈ సినిమాలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా హిట్ తో వారికి మంచి బ్రేక్ వచ్చింది.చిన్న సినిమాగా విడుదల అయ్యి ఫైనల్ రన్ లో పెద్ద సూపర్ హిట్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.ఇక మళ్ళీ ఇన్నాళ్ళకు అదే టీమ్ తో సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే టైటిల్ పెట్టి సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.తాజాగా విడుదల అయిన ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా సీన్స్ గురించి వివరిస్తూ ఉండగా భయానక ఇంట్లో ఊహించని అలజడి  అవుతుంది. 


ఇక హీరోయిన్ అంజలి తన పాత్రలో నిమగ్నమై షూటింగ్ చేస్తుండగా తోటి కమెడియన్స్ అల్లరి ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది.సీనియర్ కమెడియన్ సునీల్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు అర్ధమవుతుంది.ఇప్పటి దాకా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రకాల కామెడీ హారర్ సినిమాలు వచ్చాయి. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది.. మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా ఈ సమ్మర్లో సినిమాకు ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రెగ్యులర్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ రాబోయే రోజుల్లో మరింత పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే విధంగా వరుస ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నారు.ఎంవివి సినిమా & కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌లపై ఎంవివి సత్యనారాయణ, జివి ఈ మూవీని నిర్మించారు. ఈ సీక్వెల్‌కి శివ తుర్లపాటి డైరెక్షన్ వహిస్తున్నారు. కోన వెంకట్ కథని రాశారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో విడుదల అయ్యాక చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: