కొత్త దర్శకులను పక్కకు పెడుతున్న విజయ్ దేవరకొండ !

Seetha Sailaja
ఈవారం విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్టార్ మూవీ పై విజయ్ దేవరకొండ చాల ఆశలు పెట్టుకున్నాడు. దీనికితోడు ఈ మూవీని టాలీవుడ్ లో కూడ విడుదల చేస్తున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడులో కూడ ఈ మూవీ ప్రమోషన్ ను చాల ఎక్కువగా చేసాడు. లేటెస్ట్ గా చెన్నై వెళ్ళిన విజయ్ దేవరకొండ అక్కడ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త దర్శకుల పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశాడు.

ఎవరైనా కొత్త దర్శకుడు ఒక మంచి కథతో విజయ్ దేవరకొండ వద్దకు వచ్చినప్పుడు అతడికి అవకాశం ఇస్తారా అంటూ అడిగిన ఒక ప్రశ్న పై విజయ్ ఇచ్చిన సమాధానం చాలామందికి షాక్ ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో తాను తన భవిష్యత్ సినిమాల ఎంపిక విషయంలో ఒక కొత్త దర్శకుడిని నమ్మి తాను ప్రస్తుత పరిస్థితులలో నటించలేనని తన సినిమా బడ్జెట్ అదేవిధంగా తన ఇమేజ్ ని కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలడు అన్న నమ్మకం తనకు ఏర్పడటం కష్టం అంటూ చేసిన కామెంట్స్ పై కొందరు విమర్శలు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ కెరియర్ లో బ్లాక్ బష్టర్ మూవీగా నిలిచిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు అప్పట్లో కొత్త దర్శకుడు అన్న విషయం అతడు మర్చిపోయడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తనకు హీరోగా ఇమేజ్ ని ఇచ్చిన ‘పెళ్ళిచూపులు’ మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ అప్పట్లో కొత్త దర్శకుడు అన్న విషయం విజయ్ మర్చిపోయాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి కొత్త దర్శకులను ప్రోత్సహించే విషయంలో అక్కినేని నాగార్జున చేసే సాహసం మరే హీరో ఇప్పటివరకు ఇండస్ట్రీలో చేసిన సందర్భాలు కనిపించవు. ఎవరి దగ్గరా సహాయ దర్శకుడుగా పనిచేయకుండా ఎటువంటి అనుభవం లేని రామ్ గోపాల్ వర్మకు ‘శివ’ మూవీ అవకాశం ఇచ్చి నాగ్ చేసిన సాహసం మరే హీరో చేయలేడు అని అంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: