ఫ్యామిలీ స్టార్: ఆ సినిమాల్లా అందరిని మెప్పిస్తుందా?

Purushottham Vinay
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా తాజా సినిమా 'ఫ్యామిలీ స్టార్'. పరశురామ్ దర్శకకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతికి వస్తుందనుకున్న ఈ సినిమా , కాస్త ఆలస్యంగా థియేటర్లలోకి రాబోతోంది. 'దేవర-1' సినిమా వాయిదా పడటంతో, ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ మేకర్స్ నిర్ణయించుకున్నారు. పైగా సమ్మర్ లాంటి మంచి సీజన్ దొరకడంతో, విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈమధ్య ఓ సందర్భంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్ గా చూపించేందుకు చేసిన సినిమా కాదని, కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని చెప్పారు.దిల్ రాజు మాటలను బట్టి చూస్తే.. ఫ్యామిలీతో పాటు యూత్ ను థియేటర్లకు రప్పించి, 'బొమ్మరిల్లు' సినిమా తరహాలోనే 'ఫ్యామిలీ స్టార్' ను పెద్ద హిట్ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

 

ముఖ్యంగా 'శతమానం భవతి' సినిమాకు దూరమైన యంగ్‌ స్టర్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.పైగా విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి క్రేజ్ ఉండడం ఈసారి బాగా కలిసొచ్చే విషయం. ఫ్యామిలీ సినిమా అంటే ఎలాగో కుటుంబ ప్రేక్షకులు వస్తారు కాబట్టి, మిగిలిన వర్గాల వారిని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఇప్పటికే ట్రైలర్ తో ఇది అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో తీసిన సినిమా అని చెప్పకనే చెప్పారు కానీ రొటీన్ అనే కామెంట్స్ కూడా వచ్చాయి. పైగా ఈ సినిమాలోని సాంగ్స్ ని టీజర్, ట్రైలర్ లోని సన్నివేశాలని బాగా ట్రోల్ చేశారు. ఈ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, బొమ్మరిల్లు వంటి సినిమాల లాగా ఆడుతుందని దిల్ రాజు గట్టి నమ్మంతో ఉన్నాడు.మరి ఈ 'ఫ్యామిలీ స్టార్' ఫ్యామిలీ ప్లస్ యూత్ ఆడియన్స్ ను ఫ్యామిలీ ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. విజయ్ కి వరుస ప్లాపులు తలనొప్పిగా మారాయి. టాక్సీవాలా తరువాత ఒక్క హిట్టు కూడా లేదు. ఇప్పుడు ఈ సినిమాతో హిట్టు కొట్టాలని ఆశిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: