తమ్ముడి పై అర్జున్ ఛాయలు !

Seetha Sailaja
హీరో నితిన్ కు సరైన హిట్ వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతోంది. చాలామంది యంగ్ హీరోలు వరస హిట్స్ తో దూసుకుపోతూ ఉంటే నితిన్ మాత్రం సరైన హిట్ కోసం ఎదురు చూడవలసి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో నితిన్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ టైటిల్ ని నమ్ముకుని తిరిగి అదే టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘తమ్ముడు’ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. వేణు శ్రీరామ్ గతంలో నానీతో ‘ఎమ్ సీ ఏ’ మూవీ చేసినప్పుడు తన వదినను మాఫియా గ్యాంగ్ నుంచి రక్షించే హీరోగా నాని పాత్రను చూపించాడు. ఇక ‘తమ్ముడు’ మూవీలో నితిన్ అక్క ఒకనాటి హీరోయిన్ లయ అత్తవారి ఇంటిలో ప్రమాదంలో ఉన్నట్లు తెలుసుకుని తన అక్కను రక్షించే హీరో పాత్రలో నితిన్ కనిపిస్తాడని టాక్.

అయితే ఈ మూవీలోని నితిన్ పాత్ర గతంలో మహేష్ నటించిన ‘అర్జున్’ మూవీ ఛాయలలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ మూవీలో కూడ మహేష్ తన అక్కాను రక్షించుకోవడానికి కాంచీపురం వెళ్ళి అక్కడ ప్రకాష్ రాజ్ సరిత లతో యుద్ధం చేసిన పాత్రగా మహేష్ ను దర్శకుడు గుణశేఖర్ చూపించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అదేవిధంగా నితిన్ కూడ తన అక్కను రక్షించుకునే తమ్ముడు పాత్రలో కనిపిస్తూ ఉండటంతో ఒకనాటి ‘అర్జున్’ మూవీని వేణు శ్రీరామ్ కొద్దిగా మార్పులు చేర్పులు చేసి నితిన్ తో తమ్ముడుగా తీస్తున్నాడా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చాల వేగంగా పూర్తి అవుతున్న పరిస్థితులలో ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేసే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీలోని కొందరు గుసగుసలు ఆడుకుంటున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడు నితిన్ కాబట్టి పవన్ అభిమానులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: