టిల్లు స్క్వేర్‌ రికార్డుతో మహేష్ సరసన చేరిన సిద్ధూ?

Purushottham Vinay
'టిల్లు స్క్వేర్‌' సినిమాతో థియేటర్‌లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.మరోకసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్ ఇంకా యాక్టింగ్‌తో సిద్దూ సూపర్ గా అదరగొట్టేశాడు.ఎన్నో భారీ అంచనాలతో థియేటర్‌లోకి వచ్చిన వారిని టిల్లు గాడు విపరీతంగా నవ్వించడమే కాకుండా ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్‌ను పంచాడు. అలా బాక్సాఫీస్‌ వద్ద టిల్లు స్క్వేర్‌ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ర్యాంపేజ్ ఆడించారు.ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్నా కూడా 'టిల్లు స్క్వేర్‌' సినిమా హిట్‌ టాక్‌తో సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండు రోజులకు ఏకంగా రూ.45.3 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్‌ ఈజీగా అందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల వైపు స్పీడ్ గా దూసుకుపోతుంది.


 ఈ సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం సినిమా తరువాత డే 1 ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమాగా టిల్లు స్క్వేర్ 2వ స్థానంలో ఉంది. గుంటూరు కారం డే 1 ఏపీ తెలంగాణాలో 40 కోట్లు వసూలు చేయగా రెండవ స్థానంలో టిల్లు స్క్వేర్ దాదాపు 10 కోట్ల దాకా వసూలు చేసింది. మూడో స్థానంలో 7 కోట్లతో హనుమాన్ సినిమా ఉంది.USA లో కూడా గుంటూరు కారం, హనుమాన్ ల తరువాత సాలిడ్  ఓపెనింగ్స్ ని ఈ సినిమా నమోదు చేసింది.నిర్మాతకు ఈ సినిమా అంతకు మించి కలెక్షన్స్‌ తెచ్చిబెట్టే ఛాన్స్‌ ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. ఇక నేడు(మార్చి 31) ఆదివారం కాబట్టి  భారీ కలెక్షన్స్‌ వచ్చే ఛాన్స్ ఉంది.మార్చి 29 వ తేదీన వచ్చిన ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్‌ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్‌ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: