ఫ్యామిలీ స్టార్: అక్కడ ఖుషి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే గీతా గోవిందం అని చెప్పాలి. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ సినిమా దాదాపు 120 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మళ్ళీ విజయ్ ఇంకా హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం పెట్ల డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ కాబోతుంది.ఇక ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. సినిమా ట్రైలర్ కూడా బాగానే అనిపించింది. అయితే పరశురాం మళ్లీ గీతా గోవిందం లాగే ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.ఈ సినిమా రన్ టైం కూడా ఎక్కువగా ఉండబోతుందని సమాచారం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్ సినిమా  ఏకంగా 2 గంటల 40 నిమిషాలు అంటే 160 నిమిషాల దాకా ఉంటుందని చెబుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకుంటే కానీ సినిమా ఫైనల్ రన్ ఎంత అన్నది తెలుస్తుంది. అయితే ఫ్యామిలీ సినిమా అని చెప్పి ఏకంగా 2 గంటల 40 నిమిషాల రన్ టైం అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది చూడాలి.


అయితే ఆడియన్స్ సినిమాలో పాత్రలకు బాగా కనెక్ట్ అవుతారన్న నమ్మకంతోనే ఇలా రన్ టైం పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ ఫ్యామిలీ స్టార్ రన్ టైం కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ రన్ టైం తో విజయ్ సినిమా సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. విజయ్ గత సినిమా తెలుగులో ప్లాప్ అయినా కూడా తమిళనాడులో మంచి టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాపై కూడా అక్కడ అంచనాలు ఏర్పడ్డాయి. అక్కడ ఈ సినిమా టాక్ బాగుంటే విజయ్ కి గట్టి మార్కెట్ ఏర్పడటం పక్కా. హాయ్ నాన్న సినిమా కూడా మౌత్ టాక్ తో తమిళనాడులో మంచి వసూళ్లు రాబట్టింది.ఖుషి కూడా అక్కడ వసూళ్లతో సేఫ్ అయింది. ఇక ఫ్యామిలీ స్టార్ కూడా ఆ సినిమాల లాగే మంచి టాక్ తెచ్చుకుంటే భారీ వసూళ్లు నమోదు కావడం పక్కా అంటున్నారు విజయ్ ఫ్యాన్స్. మరి చూడాలి ఫ్యామిలీ స్టార్ తమిళనాడులో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: