అనుపమ పరమేశ్వరన్ వ్యధ !

Seetha Sailaja
ఈవారం విడుదలకాబోతున్న ‘టిల్లు స్వ్వేర్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక  మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రేజీ హీరోయిన్ అనుపమ  పరమేశ్వరన్ సినిమాలలో హీరో హీరోయిన్స్ మధ్య  వచ్చే రొమాంటిక్ సీన్స్ పై కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసింది. వెండి తెర పై రొమాన్స్ సీన్స్ వస్తున్నప్పుడు వాటిని చూసి యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి అలాంటి సీన్స్ ప్రతి సినిమాలోను వీలైనంత వరకు పెడుతూ ఉంటారని ఇలాంటి సీన్స్ లో హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తూ నటిస్తే ఆఫర్స్ బాగా వస్తాయని ప్రేక్షకుల భావన అంటూ ఆమె అభిప్రాయ పడింది.

అయితే ఇలాంటి సీన్స్ లో నటించే సమయంలో సుమారు 100 మంది యూనిట్ సభ్యులు తమను చూస్తూ ఉంటారని అలాంటి పరిస్థితులలో ఫీలింగ్స్ వచ్చేలా నటిస్తూ నటించే విషయంలో చుక్కలు కనిపిస్తాయని ఆమె అభిప్రాయ పడింది. ఆ సీన్ సరిగ్గా రాక ఒకటికి రెండు సార్లు ఘాట్ చేయవలసి వచ్చినప్పుడు హీరోయిన్ పాత్రలో నటించే నటి బాధ వర్ణనాతీతం అని అంటోంది.

అంతేకాదు ఇలాంటి సీన్స్ లో నటించే సమయంలో హీరోలు కూడ చాల ఇబ్బంది పడతారు అంటూ చాలామంది సగటు ప్రేక్షకులు అనుకునే విధంగా రొమాంటిక్ సీన్స్ లో నటించి మెప్పించడం అనుకున్నంత సులువు కాదు అని అంటోంది. ఇక ‘టిల్లు స్క్వేర్’ లో తన నటనకు మంచి ప్రశంసలు వస్తాయని ఈమూవీ విడుదల తరువాత చాలామంది తన పాత్ర గురించి మాట్లాడుకుంటారు అని అంటోంది.

సంక్రాంతి సీజన్ తరువాత సరైన హిట్ లేక సతమతమైపోతున్న టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఈమూవీ హిట్ సరైన ఊపు ఇస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఆన్ లైన్ టిక్కెట్స్ బుకింగ్ కు వస్తున్న స్పందన బట్టి ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలక్షన్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా సిద్ధూ జొన్నలగడ్డ అనుపమా పరమేశ్వరన్ ల రేంజ్ ని పెంచుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: