టిల్లు స్క్వేర్: ఆ సునామిలో కొట్టుకుపోదుగా?

Purushottham Vinay
DJ టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బిగ్ హిట్ గా నిలవడంతో ఈ సీక్వెల్ టిల్లు స్క్వేర్ కథకు మంచి క్రేజ్ ఏర్పడింది. అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఎంటెర్టైన్ చేయబోతోంది. అందువల్ల యూత్ ఆడియన్స్ లో టిల్లు స్క్వేర్ పై ఎక్కువ ఆసక్తి నెలకొని ఉంది. రామ్ మిరియాల ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదల కాబోయే ఈ సినిమాకి హాలీవుడ్ నుంచి మాత్రం గట్టి పోటీ ఎదురయ్యేలా కనిపిస్తోంది. హాలీవుడ్ లో గాడ్జిల్లా కాంగ్ 2 సినిమా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. గాడ్జిల్లా కాంగ్ మొదటి పార్ట్ కరోనా కాలంలో ఓటీటీలో విడుదల అయ్యింది. అక్కడ ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సీక్వెల్ పై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో ఈ మూవీల్లో రిలీజ్ చేస్తున్నారు.


ఇండియాలో కూడా భారీ స్క్రీన్స్ లో గాడ్జిల్లా కాంగ్ 2 సినిమా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలకి తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లో హాలీవుడ్ సినిమాలకి విశేషమైన స్పందన  ఉంటుంది.అవతార్ 2 సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న ఇండియాలో ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఓపెన్ హైమర్ కి కూడా ఇండియాలో చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ మూవీకి మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ గాడ్జిల్లా కాంగ్ 2 మూవీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బీ,సి సెంటర్స్ లో టిల్లు స్క్వేర్ సినిమా హవాని ఎవరూ నియంత్రించలేరని అంచనా వేస్తున్నారు. ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉండటంతో కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్, మార్కెట్ రేంజ్ కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: