ఆ ఏరియాలో "ఖుషి" తో పోలిస్తే చాలా తక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న "ఫ్యామిలీ స్టార్" మూవీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈయన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే సినిమాలో హీరో గా నటించి సోలో హీరో గా మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ నటుడు అర్జున్ రెడ్డి ,  గీత గోవిందం , టాక్సీవాలా లాంటి విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నర్వాన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ కి భారీ మొత్తం లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది ఇలా ఉంటే ఖుషి మూవీ కి కోస్టల్ ఆంధ్ర ఏరియాలో 20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. కాకపోతే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇ

కపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కోస్టల్ ఆంధ్ర ఏరియా ఫ్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఆ ఏరియాలో 17 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇకపోతే ఖుషి మూవీ తో పోలిస్తే కోస్టల్ ఆంధ్ర ఏరియాలో ఫ్యామిలీ స్టార్ మూవీ కి తక్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: