
కొంచమైనా సిగ్గుండాలి.. హీరో నిఖిల్ సంచలన పోస్ట్?
గత కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్లు కొడుతూ అదరగొడుతున్నారు హీరో నిఖిల్. ఇక ఇటీవలే నిఖిల్ దంపతులు ఒక బిడ్డకు జన్మనిచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిఖిల్ సినిమాల విషయంలోనే కాదు సామాజిక విషయాలలో కూడా స్పందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో పోస్టులు పెడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇటీవల ఏకంగా సిగ్గుండాలి అంటూ సంచలన ఆరోపణలు చేస్తూ హీరో నిఖిల్ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లో భారత జట్టు దారుణమైన ఓటమిని చవిచూసింది. ఏకంగా 0-3 తేడాతో ఓడిపోయింది.
అయితే ఈ ఓటమీ గురించి ఎవరూ పట్టించుకోకపోవడమే కాదు.. ఎక్కడ వార్తల్లో కూడా కనిపించడం లేదు. అయితే ఇలాంటి దారుణమైన ఓటమి గురించి హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో. ఇలాంటి ఫలితాలను సాధించడం ఏంటి.. ఇందుకు భారత ఫుట్బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. దయచేసి భారత క్రీడా వ్యవస్థను మార్చండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ కి భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తో పాటు ఐఎఫ్సి ని కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.