RC16: చరణ్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ని బ్రేక్ చేస్తాడా?

Purushottham Vinay
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాపై అంచనాలు రోజూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో, టెక్నీషియన్ల విషయంలో బుచ్చిబాబు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.ఈ సినిమాకు ఇంటర్నేషనల్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక కాగా ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించి మూడు ట్యూన్లు ఇచ్చారని సమాచారం తెలుస్తోంది. ఈ సినిమా గురించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ మూవీతో రామ్ చరణ్ ఒక సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆ సెంటిమెంట్ ను రామ్ చరణ్ బ్రేక్ చేయాల్సి ఉంది.డైరెక్టర్ బుచ్చిబాబు మాత్రం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం తెలుస్తుంది.గేమ్ ఛేంజర్ సినిమా షూట్ పూర్తైన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


ఈ సినిమాలో జాన్వీ కపూర్  నటిస్తుండగా ఈ సినిమాలో ఆమె పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనున్నారు.రామ్ చరణ్ 16వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రామ్ చరణ్ నిదానంగా సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకునేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇంకా ఎన్నో సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి. RC 16 మూవీలో సంజయ్ దత్ రౌడీగా నటిస్తున్నాడు.ఇక గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యనున్నారు. ఈ సినిమా ఓటిటి డీల్ కూడా అప్పుడే పూర్తయినట్లు సమాచారం తెలుస్తుంది.అమెజాన్ ప్రైమ్ 105 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. అలాగే ఈ సినిమా ఆడియో రైట్స్ ని సరిగమప కంపెనీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఇదిలా ఉండగా సుకుమార్, రామ్ చరణ్, దేవి కాంబోలో రెండో సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ త్వరలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: