వీరిలో టాలీవుడ్ నెం.1 హీరో ఎవరంటే?

Purushottham Vinay
గత సంవత్సరం పుష్ప సినిమాలోని తన యాక్టింగ్ కు గాను జాతీయ ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి నుంచి అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేశారు.అలాగే ఇన్ స్టాగ్రామ్ లో సౌత్ ఇండియా నుంచి అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. మొత్తం 25 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియా హీరోగా బన్నీ నిలిచారు.ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ లో బన్నీ తెలిపాడు.ఇక బన్నీ తరువాత రెండు, మూడు స్థానాల్లో స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఉన్నారు. అలాగే కొన్ని రోజుల క్రితం.. ఇన్ స్టాగ్రామ్ అల్లు డాక్యుమెంటరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న ఫస్ట్ యాక్టర్ కూడా బన్నీనే కావడం విశేషం.అల్లు అర్జున్ కు ఇంకో అరుదైన గౌరవం కూడా దక్కబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలు ఉన్న దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ యొక్క మైనపు విగ్రహం కొలువుదీరబోతోంది. అందుకోసం ఇప్పటికే అల్లు అర్జున్ విగ్రహం కోసం కొలతలు కూడా తీసుకున్నారు నిర్వాహకులు. మార్చి 28వ తేదీన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.అయితే ఈ విగ్రహం కేవలం పుష్ప క్యారెక్టర్ క్రేజ్ తో వచ్చింది కాబట్టి ఆ గెటప్ లో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విగ్రహ ఆవిష్కరణ వేడుకకు అల్లు అర్జున్ హాజరవుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలు కూడా ఉన్నాయి.


ప్రభాస్ కి కూడా కేవలం బాహుబలి క్యారెక్టర్ ని బేస్ చేసుకొని విగ్రహం పెట్టారు.నిజానికి ప్రభాస్ కి బాహుబలి వల్ల ఇంత క్రేజ్ వచ్చింది.కానీ మహేష్ విగ్రహం మాత్రం మహేష్ ఒరిజినాలిటీని బేస్ చేసుకొని పెట్టడం విషయం. ఇక్కడే అర్థం అవుతుంది మహేష్ బాబు స్టామినా ఏంటనేది.ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకుండా కేవలం రీజనల్ సినిమాలతోనే అంతర్జాతీయ రేంజ్ కి మహేష్ ఎదగడం అంటే మామూలు విషయం కాదు. బహుశా మహేష్ బాబు రియల్ లైఫ్ లో చేసే మంచి పనులు కూడా ఆయన్ని ఆ రేంజ్ లో నిలబెట్టాయని అనుకోవచ్చు. అంతేగాక X లో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్న ఏకైక సౌత్ ఇండియా నటుడు మహేష్ కావడం విశేషం. ప్రభాస్ కి ఫేస్ బుక్ లో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు. బన్నీకి ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నారు. అయితే అది కేవలం హీరోల్లో మాత్రమే.


 నిజానికి సమంత, కాజల్, రష్మిక లాంటి హీరోయిన్స్ కి ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో బన్నీ, ప్రభాస్ కంటే రెట్టింపు ఫాలోయర్స్ ఉన్నారు. కానీ X లో మాత్రం ఫాలోయర్స్ విషయానికి వస్తే.. సౌత్ ఇండియా నుంచి ఏ హీరో కానీ ఏ హీరోయిన్ కానీ మహేష్ దారిదాపుల్లో కూడా లేరు. ప్రభాస్ పెద్ద స్టార్ అయ్యాడంటే కారణం బాహుబలి లాంటి పెద్ద పాన్ ఇండియా సినిమా లాటరీ, బన్నీ స్టార్ అయ్యాడంటే అతని పిఆర్ టీం ఇంకా పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా లాటరీ.. కానీ ఇలాంటి లాటరీస్ లేకుండా రీజనల్ సినిమాలతోనే మహేష్ ఈ రేంజ్ క్రేజ్ సంపాదించడం అంటే మాములు విషయం కాదు. అంతేకాదు మహేష్ పాత సినిమాలు రీరిలీజ్ అయ్యి కూడా రికార్డులు సృష్టించాయి. సో మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


ఇక నెంబర్ 1 రేసులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పోటీ పడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్  క్రేజ్ దక్కించుకున్నారు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి నెంబర్ 1 ఛాన్స్ లేదు.భవిష్యత్తులో ఆయన సినిమాలు ఫలితాలు బాగుంటే మళ్ళీ నెంబర్ 1 రేసులో ఉండొచ్చు. సో వీరందరికి క్రేజ్ బాగానే ఉన్నా ఓవరాల్ అన్ని రికార్డ్స్ లో  మహేష్ బాబు పేరు ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది. దాన్ని బట్టి మహేష్ నెంబర్ 1 అని చెప్పవచ్చు.ఇక రాజమౌళితో చేసే సినిమా హిట్ అయితే ఎవరు మహేష్ దారిదాపుల్లో కూడా ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: