ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన వీడియో..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. కాగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం దేవర పార్టు వన్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన తాజా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఇటీవల హైదరాబాదులో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు చిత్ర బృందం అంతా కలిసి గోవాకు వెళ్లారు. అక్కడ సైతం కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా షూట్ చేస్తున్నారు అని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే దేవర సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అందులో భాగంగానే అక్కడ జరుగుతున్న షూటింగ్లో కొందరు ఆకతాయిలు వీడియో తీశారు. షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న వ్యక్తులు ఎవరో అక్కడ వీడియో తీసి ఆతర్వాత దాన్ని నెట్టింట అప్‌లోడ్‌ చేశారు. ఎన్టీఆర్‌ సముద్రం ఒడ్డున నలుపు రంగు చొక్కా.. అదే రంగులో ఉన్న పంచ కట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లో బంధించిన కొందరు దాన్ని సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటం.. ఎన్టీఆర్ సినిమా కావడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

నెటిజన్లు దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆకతాయిలు చేసిన పనిగానే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం కాస్త లోతుగా ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో లీక్‌ల ట్రెండ్‌ నడుస్తోందనీ.. సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిటే ఇలా చేసి ఉంటుందని ఇంకొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఎలా జరిగినా కూడా సినిమాకు మాత్రం మంచి హైప్‌ వస్తుందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు.  ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పక్కన హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. ఇక ఇటీవల విడుదలైన టీజర్‌ అభిమానులను ఉర్రూతలూగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: