"పుష్ప 2" లో "అల్లు అర్జున్" అలా కనిపించనున్నాడా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లు అర్జున్ ఒకరిగా "పుష్ప పార్ట్ 1" సినిమాలో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లోని నటనకు గాను ఆయనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పహాధ్ ఫాజీల్ ఈ మూవీ లో పాత్రలో నటించగా ... ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించారు.  దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి కొనసాగింపుగా "పుష్ప పార్ట్ 2" అనే మూవీ రూపొందుతుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యం లో ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... అల్లు అర్జున్ ఈ మూవీ లో ముసలి వ్యక్తి పాత్రలో కొంత భాగం కనిపించబోతున్నట్లు ... అందులో భాగంగా ఆ పాత్రలో అల్లు అర్జున్ వేషధారణ ... డైలాగ్ డెలివరీ కూడా చాలా వరకు పార్ట్ 1 తో పోలిస్తే వ్యత్యాసంగా ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుడు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ ని కూడా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: