నటుడు శివాజీ కూతురు గురించి అసలు నిజం బయటపెట్టిన అలీ..!?

Anilkumar
తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివాజీ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజిగా ఉన్నాడు. ఇటీవల బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. ఈ షో తో ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. దానితో శివాజీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అలా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే 90 సిరీస్ తో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిగ్ బాస్ షో పుణ్యమా అని శివాజీకి ఫ్యామిలీ జనాలు బాగా దగ్గరయ్యారు. అలా ఈ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది.

భార్య శ్వేత కొడుకులు బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఫ్యామిలీ వీక్ లో తన పెద్దబ్బాయి రావడంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు శివాజీ. అలా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.. అలాగే శ్వేత, రిక్కీ కూడా ఒకటి రెండు సందర్భాల్లో షోలో మాట్లాడారు. ఈ క్రమంలో శివాజీకి ఇద్దరు అబ్బాయిలు అన్న విషయం అందరికీ తెలిసింది. అయితే శివాజీకి కూతురు కూడా ఉందని ఆ మధ్య నటుడు సమీర్ కూడా అన్నాడు. దాంతో మనకు తెలియని కూతురు ఎవరు? అంటూ పలు అనుమానాలు తెరపైకి వచ్చాయి. కాగా టాలీవుడ్ కమెడియన్ ఆలీతో సరదాగా సెకండ్ సీజన్ స్టార్ట్ చేశాడు నటుడు ఆలీ.

ఈ షోకి గెస్ట్ గా శివాజీ వచ్చారు. శివాజీని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు ఆలీ. ఈ క్రమంలో ఒక పాప ఫోటో స్క్రీన్ పై వేసి చూపించాడు. ఈ పాప మీ అమ్మాయా? అని అడగ్గా అవును మా అమ్మాయే అన్నాడు.  నాకు ఇద్దరు అబ్బాయిలు మాత్రమే సంతానం. అది కెన్నీ, రిక్కీ. అమ్మాయిలు లేరు. నేను ఎక్కడా విత్తనాలు చల్లలేదు. అలాగే మా కుటుంబంలో అందరికీ అబ్బాయిలే. మా తమ్ముడికి కూడా ఇద్దరు అబ్బాయిలు. అంతెందుకు మా ఇంట్లో జంతువులకు కూడా మగ బిడ్డలే పుడతాయి. ఆ ఫొటోలో ఉంది నా చిన్న కొడుకు రిక్కీ. వాడికి అమ్మాయి గెటప్ వేశాము. బహుశా ఈ ఫోటో చూసే సమీర్ నాకు కూతురు ఉందని పొరపాటు పడి ఉండొచ్చు అని శివాజీ అసలు విషయాన్ని బయట పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: