గామితో విశ్వక్ ఎంత లాభపడ్డాడు?

Purushottham Vinay
డిఫరెంట్ కాన్సెప్ట్ తో యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన సినిమా 'గామి'. విద్యాధర్ రూపొందించిన ఈ మూవీ యూవీ సెల్యూలాయిడ్, టమడా మీడియా బ్యానర్లపై కార్తీక్ శభరీస్ నిర్మించారు. ఇందులో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. అలాగే అభినయ కీలక పాత్రను చేసింది. మహ్మద్ సమద్, హారిక, దయానంద్, శాంతి రావులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమరాన్ ఈ సినిమాకి సంగీతం ఇచ్చాడు.ఈ మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అనేది లభించింది. అయితే, రెండో వారం నుంచి బాగా డౌన్ అయింది. అయినా ఈ సినిమాకి వసూళ్లు భారీగానే లభించాయి.ఈ 'గామి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో కలిపి ఫుల్ రన్‌లో రూ. 8.41 కోట్లు వచ్చింది. ఇంకా అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 91 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.44 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొత్తంగా ఈ మూవీకి రూ. 11.76 కోట్లు షేర్‌, రూ. 22.90 కోట్లు గ్రాస్ వచ్చింది.


'గామి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తంగా రూ. 11.00 కోట్లుగా నమోదైంది. అయితే భారీ అంచనాలతో భారీగా వసూళ్లు రాబడుతుంది అనుకున్న ఈ మూవీకి ఫుల్ రన్‌లో కేవలం రూ. 11.76 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 76 లక్షలు మాత్రమే ఈ సినిమా వసూలు చేసింది.ఈ సినిమాకి నైజాంలో రూ. 4.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.12 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 71 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 45 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో కలిపి.. రూ. 8.41 కోట్లు షేర్ వచ్చింది.ట్రైలర్, ప్రమోషన్స్ చూసి 50 కోట్ల రేంజ్ లో భారీ వసూళ్లు రాబడుతుంది అనుకున్న ఈ చిత్రం జస్ట్ 11.76 కోట్లు మాత్రమే వసూలు చేసింది.అయితే ఈ సినిమా మాత్రం మేకర్స్ ని నష్టాలు పాలు కాకుండా సేవ్ చెయ్యడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: