సుహాస్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఫిక్స్ అయిన సినిమా టైటిల్ ఏంటంటే..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకులు సరికొత్త కాంబినేషన్స్ ను సెట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు టాలీవుడ్ లో మరొక క్రేజీ కాంబినేషన్ రెడీ అయింది. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మహానటి కీర్తి సురేష్ ఇప్పుడిప్పుడే హీరోగా తన సత్తా ఏంటో చూపిస్తున్న సుహాస్ కాంబినేషన్లో ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది అన్న వార్తలు వినబడుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్నిలా మూవీ ఫేమ్ అని ఐవి శశి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. 

కాగా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మహానటి కీర్తి సురేష్ ఇప్పుడిప్పుడే హీరోగా తన సత్తా ఏంటో చూపిస్తున్న సుహాస్ కాంబినేషన్లో  ఈ సినిమా కి ఉప్పు కప్పురంబు అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వసంత్ మురళీ కృష్ణ ఈ కు కథ అందిస్తున్నారు. రాధిక లావూ నిర్మాతగా వ్యవహరించనున్నారు.త్వరలోనే ఈ పట్టాలెక్కనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. మంగళవారం (మార్చి 19) న జరిగిన ఒక ఈవెంట్ లో సినిమా  కు సంబంధించిన వివరాలను ప్రకటించింది. అమెజాన్ ఒరిజినల్స్ మూవీ గా తెరకెక్కనుందంటే.. ఉప్పుకప్పురంబు థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్ కానుందన్న మాట. 

షూటింగ్ పూర్తయ్యాక అధికారిక స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించనుంది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఇదిలా ఉంటే ఇదే ఈవెంట్ లోనే ఉప్పు కప్పురంబు స్టోరీ లైన్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. పూర్తి సెటైరికల్ కామెడీ మూవీగా ఇది రానుందట. 'స్మశానంలో స్థలం అయిపోవడంతో ఓ గ్రామంలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది అక్కడి జనాల మధ్య తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. మరి ఆ గ్రామస్తుల సమస్య పరిష్కారమైందా? అన్నదే సినిమా కథ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: